కలియుగానికి ఇది క్లైమాక్స్‌ సీఎం జగన్‌ సంచలన వ్యాఖ్య

    0
    485

    ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు దేవుడి చుట్టూ తిరుగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు ఆలయాలపై దాడుల అంశం ఎక్కువగా ఫోకస్‌ అవుతోంది. దీని వెనకాల ముఖ్యమంత్రి మతస్థులు ఉన్నారన్నది ప్రతిపక్షాల ఆరోపణ కాగా, విపక్షాలే ఇలాంటి ఘటనకు పాల్పడి రాజకీయ లబ్ధి పొందాని చూస్తున్నాయని అధికార పార్టీ ఒకరిపై ఒకరు ఆరోపణ లు చేసుకుంటున్నారు. ఆరోపణలు ప్రత్యారోపణలు ఎలా ఉన్నా వైసీపీ ప్రభుత్వానికి డ్యామేజీ జరుగుతోంది. ఈ విషయంలో ఇప్పటి వరకూ కేసులు, విచారణ వంటి చర్యలతో ముందుకు వెళుతున్న ముఖ్యమంత్రి వై.యస్‌.

    జగన్‌మోహన్‌రెడ్డి.. విపక్షాల ఆరోపణలు ప్రజల్లోకి బలంగా వెళుతున్నాయని, అటు పార్టీకి, ఇటు ప్రభుత్వానికి చెప్పుకోదగ్గ స్థాయిలోనే చెడ్డ పేరు వచ్చిందని గ్రహించినట్టు ఉన్నారు. అందుకే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ‘‘కలియుగానికి ఇది క్లైమాక్స్‌’’ అంటూ సంచన వ్యాఖ్యలు చేశారు.
    ఈరోజు తిరుపతిలో జరిగిన ‘పోలీస్‌ డ్యూటీ మీట్‌’ కార్యక్రమంలో సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ఇది పొలిటికల్‌ గెరిల్లా వార్‌. మన ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రోజేనే విగ్రహాలను ధ్వంసం చేస్తూ, పథకాలకు, ప్రభుత్వానికి మైలేజీ రాకుండా చేస్తున్నారు.

    విగ్రహాలు ధ్వంసం చేయడం ఎవరికి లాభమో అందరికీ తెలిసిందే. ప్రభుత్వాన్ని అస్థిర పరిచే కుట్ర చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 20 వేల ఆలయాల్లో సీసీ కెమరాలు ఏర్పాటు చేశాం. దీంతో మారుమూల సీసీ కెమెరాలు లేని చోట్ల ఇటువంటి దురదృష్టకర, దుష్ట సంఘటనలకు ప్పాడుతున్నారు. దోషులను తప్పకుండా గుర్తించి చర్యలు తీసుకుంటాం. దాడులు జరిగిన చాలా ఆలయాలు టీడీపీ నేత ఆధ్వర్యంలో నడుస్తున్నవే. ఇలా మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూడటం రాజకీయాల్లో జుగుప్సాకర పరిస్థితులను సృష్టిస్తున్నాయి. వీరికి దేవుడంటే భయం లేదు. దేవుని రాజకీయాలు చూస్తూ సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు.