పదేళ్లపాటు ప్రజలతో మమేకమై ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు వై.యస్. జగన్‌మోహన్‌రెడ్డి. అనంతరం 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అద్వితీయమైన విజయాన్ని సాధించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటినుండి అడపా దడపా తప్ప తాడేపల్లిలోని తన క్యాంపు ఆఫీసును వదిలి బయటకు రాలేదు. ఏ కార్యక్రమం అయినా.. ఏ ప్రారంభోత్సవం అయినా ఆన్‌లైన్ పద్ధతిలోనే నడిపించేస్తారు. ఇప్పటి వరకూ ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఎవ్వరూ ఇంతలా క్యాంపు ఆఫీస్‌కు అతుక్కుపోయిన దాఖలాలు లేవు. ముఖ్యమంత్రి ఆఫీస్‌లో అందుబాటులో ఉంటే ప్రభుత్వ పరంగా ఎన్నో సమస్యకు పరిష్కారాలు చకా చకా జరిగిపోతుంటాయి.
కానీ జనంలో చరిష్మా ఉన్న నాయకుడు ఇలా నాలుగు గోడలకే పరిమితం అయిపోతే ఆ పార్టీకి మాత్రం ఖచ్చితంగా నష్టం చేకూరుస్తుంది. పైగా మీడియా అండ పుష్కంగా ఉన్న తెలుగుదేశం పార్టీ విపక్షంగా ఉంటే ఆ నష్టం మరింతగా పెరుగుతుంది. నిజం ఊరు దాటేలోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టి వచ్చేస్తుందనే సామెత రాజకీయాల్లో పరిపాటి.
ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినప్పటికీ, ఎంతగా ప్రజల మనసుల్లో చిరస్థాయి స్థానం సంపాదించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఆశించిన సానుకూలత మాత్రం ప్రజల్లో కనపడడం లేదన్నది వాస్తవం. 151 మంది ఎమ్మెల్యేల బంతో పటిష్టంగా ఉన్నప్పటికీ, పట్టుమని 20 మంది ఎమ్మెల్యే బం కూడా లేని విపక్షాన్ని ఎదుర్కోవటానికి నానా తంటాు పడాల్సి వస్తోంది. మీడియా అండతోనే టీడీపీ ప్రతి చిన్న అంశాన్ని తనకు అనుకూంగా ముచుకుంటూ ముందుకు వెళుతోంది. దాన్ని ఎదుర్కోవడానికి అధికార వైసీపీ నానా తంటాలు పడుతోంది.
ఇటీవల ఈ విషయమై జగన్ వద్ద ఆయనకు ముఖ్యమైన సలహాదారు ఒకరు చర్చించినట్లు తెలిసింది. ‘‘మీరు వీలైనప్పుడల్లా ప్రజల్లోకి వచ్చి జరుగుతున్న వాస్తవాలు చెబితే తప్ప ఫలితం ఉండదు’’ అన్నారట. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇళ్ల పట్టాల పంపిణీని సైతం అడ్డుకునేలా విపక్ష టీడీపీ తెరవెనుక పావులు కదిపిందని వైసీపీ విమర్శిస్తోంది. దీనికి తోడు ఏకంగా ముఖ్యమంత్రి స్వంత నియోజకర్గంలో పేదలకు ఇళ్ల పట్టాలు రాకుండా పంపిణీకి ఒక్కరోజు ముందు స్టే తీసుకురావడం సీఎం జగన్‌కు మరింత ఆగ్రహం తెప్పించింది.
మనం మౌనంగా ఉంటే అయ్యేపని కాదు అని గ్రహించిన సీఎం ఇక వీలైనంత ఎక్కువగా ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వాలని, ఆయా సభల్లో ప్రత్యర్థుల వైఖరిని ఎండగట్టడం ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలియజేయాని నిర్ణయించుకున్నారట. అందుకే ఇళ్ల పట్టాల పంపిణీ కోసం ఏర్పాటు చేసిన సభల్లో పదే పదే టీడీపీ వేసిన కేసుల వ్లలనే కొన్ని చోట్ల పట్టాల పంపిణీ ఆస్యం అవుతోందని చెప్పడం ద్వారా ప్రజల్లో టీడీపీ ప్రజా సంక్షేమాన్ని అడ్డుకుంటోందనే భావన ఏర్పడుతుందని భావిస్తున్నారు. అందుకే ఇళ్ల పట్టాకు సంబంధించిన సీఎం సభను రాయసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రల్లో ఏర్పాటు చేయించినట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో కూడా వీలైనంతగా ప్రజలతో నేరుగా ఇంటరాక్ట్ అవ్వడానికి సీఎం టీం ప్రణాళికు రచిస్తున్నట్లు సమాచారం. కారణమేదైనా ఇన్నాళ్లకు కోట దాటి రాక తప్పదనే తత్వం జగన్‌కు బోధ పడడం ఆ పార్టీ శ్రేణులకు ఉత్సాహాన్నిస్తోంది.